చంద్రబాబుకు భారీ షాక్..ఓటుకు నోటు కేసు నాలుగు వారాల్లో తేల్చాలన్న సుప్రీం..!

Friday, September 23rd, 2016, 12:23:29 PM IST

babu-chandra-babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబుకు భారీషాక్ అని చెప్పవచ్చు. ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.ఓటుకు నోటు కేసు ని నాలుగు వారాల్లో తేల్చాలని హైకోర్టు కు సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు పంపింది.

ఈ కేసులో చంద్రబాబుని కూడా విచారించాలని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం ను ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో ఆయనతరుపున సీనియర్ న్యాయవాది నాప్రే వాదనలు వినిపించారు.కేసు విచారణలో హైకోర్టు 8 వారలు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము విచారణలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది.అయితే నాలుగువారాల్లో ఈ కేసుని విచారించాలని హై కోర్ట్ ని ఆదేశించింది.