బిగ్ బ్రేకింగ్: రోజా నమ్మకాన్ని నట్టేట ముంచిన సీఎం జగన్..!

Saturday, June 8th, 2019, 03:34:08 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే నేడు సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. అయితే నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో చెప్పినట్టుగానే జగన్ తన కేబినెట్‌లోకి 25 మంది మంత్రులను తీసుకున్నాడు. అయితే ఆ లిస్ట్‌లో వైసీపీ సీనియర్ నేత, నగరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజాకు స్థానం లభించలేదు.

అయితే పార్టీలో ముందుంచి సీనియర్ నేతగా ఉంటూ, నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించింది. అయితే అందరు అనుకున్నట్టు ఈ సారి వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ ఖచ్చితంగా రోజాను మంత్రిని చేస్తారనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే ఈ ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో అందరూ రోజాకు మంత్రి పదవి పక్కా అని, మహిళా కోటాలో ఫైర్ బ్రాండ్ రోజాకు హోం శాఖను అప్పచెబుతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఆ తరువాత సీఎం జగన్ రోజాకు స్పీకర్ పదవి ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే రోజా కూడా దీనిపై స్పందిస్తూ జగన్ అన్నపై భరోసా ఉందని, తప్పకుండా కేబినెట్‌లో తనకు మంత్రి పదవి కలిపిస్తారనే నమ్మకంతో మొన్నటి వరకు ఉంది.

అయితే నిన్నటితో రోజా మంత్రి పదవికి పూర్తిగా గండి పడిపోయింది. రోజాకు మంత్రి పదవి కాదు కదా కనీసం స్పీకర్ పదవి కూడా ఇవ్వకుండా జగన్ హ్యాండ్ ఇచ్చేశాడు. అయితే రోజాకు జగన్ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారట. ముందు నుంచి పార్టీలో ఉన్నా కూడా నాకు స్థానం లభించకపోవడం ఏమిటని పార్టీపై ఇప్పుడు పీకల్లోతు కోపంతో ఉందని అర్ధమవుతుంది. అయితే సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంగా రోజాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారని, రెండున్నర సంవత్సరాల తరువాత అమెకు అవకాశం కల్పిస్తానని చెప్పినట్టు వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా సీనియర్ నేతగా ఉన్న రోజాకు మొదటి లిస్ట్‌లో స్థానం లభించకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అయితే రెండేళ్ల తరువాత అయినా సీఎం జగన్ రోజాకు మంత్రి పదవి కలిపిస్తారా లేక మళ్ళీ మొండి చేయి చూపుతారా అనేది మాత్రం తెలియడంలేదు.