హాట్ ఫొటో : స్టైలిష్ లుక్ లో షాక్ ఇచ్చిన క్యూటీ

Monday, January 22nd, 2018, 01:46:01 PM IST

రీసెంట్ గా బాలీవుడ్ 2018 జియో ఫిల్మ్ ఫెర్ అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులతో పాటు లేటెస్ట్ హీరో హీరోయిన్స్ కూడా వేడుకలో మెరిశారు. ముఖ్యంగా కొత్త మంది హీరోయిన్స్ అయితే ఫ్యాషన్ కాస్ట్యూమ్ తో వచ్చి అందరి చూపును వారి వైపు తిప్పుకున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా మాత్రం ఒక యువ హీరోయిన్ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. బాలీవుడ్ స్పెషల్ సాంగ్స్ ద్వారా బాగా పాపులర్ అయిన ఊర్వశి రౌతేలా తన లుక్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఆమె ఘాటు అందాల ప్రదర్శనకు ఒక్కసారిగా కెమెరాలన్నీ ఆమె వైపు తిరిగాయి. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే స్టార్ హీరోల సినిమాల్లో ఈ బ్యూటీ ఈజీగా అవకాశం అందుకునేలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఊర్వశి రేస్ 3 – హేట్ స్టోరీ 4 సినిమాల్లో నటిస్తోంది.