ప్రయాణికులు భారత్ పర్యటనకు దూరంగా ఉండాలి – యూఎస్ ప్రభుత్వం

Tuesday, April 20th, 2021, 11:30:12 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ప్రతి రోజూ కూడా రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం, వెయ్యికి పైగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్ లో కరోనా తీవ్రత ఇతర దేశాలను కూడా కలవర పెడుతోంది. తాజాగా యూ ఎస్ ప్రభుత్వం తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. కొద్ది రోజుల పాటు భారత్ పర్యటనకు దూరంగా ఉండాలి అంటూ సూచించడం జరిగింది. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఒక ప్రకటన లో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే భారత్ పర్యటన ను రద్దు చేసుకోవడం మంచిది అని, అత్యవసరం ఉంటే ముందుగా పూర్తి స్థాయిలో వాక్సిన్ తీసుకోవాలి అని తెలిపింది. అయితే కేవలం యూ ఎస్ మాత్రమే కాకుండా, ఇతర దేశాల ప్రభుత్వాలు సైతం ఇదే తరహాలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.