అమెరికాలో ఉన్న పాపానికి భారతీయులకి ఇన్ని చిత్ర హింసలా..?

Friday, February 1st, 2019, 09:00:09 PM IST


గత కొన్నాళ్ల నుంచి అగ్ర రాజ్యం అమెరికాలో అక్కడ వలసదారులు ఉండడానికి వీలు లేదంటూ యూఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.కానీ ఇప్పుడు మాత్రం ఈ చర్యలు కాస్త తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయని అక్కడ వస్తున్న కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తుంది.ఇటీవలే యూఎస్ లోని అతి పెద్ద స్టేట్స్ లో ఒకటైన టెక్సాస్ లోని యూఎస్ వలసదారుల అధికారులు అక్కడ ఉన్నటువంటి కొన్ని దేశాలకు సంబందించిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

కొత్త సంవత్సరం ప్రారంభమైన మొదట్లోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు భారతదేశ మరియు క్యూబా దేశాలకు చెందిన వారిని వారి కుటుంబాలతో సహా దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆజ్ఞ్యాపించారు.దీనితో వారిలో కొంతమంది నిరాహార దీక్షలకు దిగారు.ఈ విషయంపై అక్కడ వచ్చిన ఒక నివేదిక ప్రకారంమొత్తం 11 మంది నిరాహార దీక్షకు దిగగా వారిలో కొంత మందికి తీవ్రస్థాయిలో డీహైడ్రేషన్ కు గురి కావడం,చాలా రోజుల నుంచి తిండి మానెయ్యడం వలన అక్కడి ఫెడరల్ జడ్జ్ ఈ జనవరి మధ్యలో వారికి అత్యవసర పరిస్థితుల్లో ద్రవాలను ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.

అదే సందర్భంలో అక్కడ బాధితుల కేసును తీసుకున్నటువంటి రూబీ కౌర్ అనే న్యాయవాది కొన్ని సంచలన నిజాలను బయటపెట్టారు.నిరాహార దీక్షకు పాల్పడిన తన క్లయింట్స్ ను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారని,వారిలో కొంత మందికి బలవంతంగా ద్రవాలను శరీరంలోకి ఎక్కించేందుకు నాసల్ ట్యూబ్స్ ను వారి ముక్కు లోనుంచి ప్రవేశ పెట్టగా వారికి తీవ్ర స్థాయిలో రక్త స్రావం మరియు ఒక్క రోజులోనే ఎన్నో సార్లు వాంతులు అయ్యాయని తెలిపారు.అలాగే వారు తన క్లయింట్స్ పై చేసిన ఈ బలవంతపు చర్యలకు వీరు ఎంతగానో బాధింపబడ్డారని తెలిపారు.

దీనితో అక్కడి ఇండో అమెరికన్ సంస్థ వారు ఇదంతా మానవ హక్కులకు వ్యతిరేఖం అని వారి నిరసనను ప్రకటించారు.అలాగే అక్కడ సౌత్ ఆసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగేదర్(ఎస్ ఏ ఏ ఎల్ టి)సంక్షిప్తంగా సాల్ట్ వారు మరో నివేదికను చెప్తున్నారు.వీరు చెప్పేది ఏమిటంటే టెక్సాస్ లో మొత్తం 30 మంది సభ్యులు నిరాహార దీక్షకి పూనుకున్నారని,ఆ సమయంలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని తీవ్రమైన పదజాలంతో దూషించడమే కాకుండా వారిని శారీరికంగా కూడా హింసించారని మరో నివేదికను పొందుపరిచారు.