రేవంత్ మద్దతుదారులు కాంగ్రెస్ లోకి రావాలి: కాంగ్రెస్ నేత

Monday, October 30th, 2017, 05:59:41 PM IST

ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ మారినా ఇంకా రేవంత్ టీడీపీ ని పొగడడం మాత్రం అస్సలు ఆపడం లేదు. ఓ వైపు పార్టీని విడిచినా కూడా ఇంకా నాకు చంద్రబాబే స్ఫూర్తి అంటూ ఆయన మీద ప్రేమను చూపిస్తున్నారు. ఫైనల్ గా మొన్నటి వరకు అందరు అనుకున్నదే జరిగింది.

రేవంత్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళుతున్నాడని అనుకున్నట్లే ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో రేవంత్ సన్నిహితంగా ఉన్నాడు. ఇక అయన ఫైనల్ గా కాంగ్రెస్ నేతగానే కొనసాగడం ఖాయమని అందరు భావిస్తున్నారు. ఇకపోతే తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ తో ఇన్నేళ్లు ఉన్న కార్య కర్తలు, మద్దతు దారులు కాంగ్రెస్ లోకి వచ్చి చేరాలని పిలుపును ఇచ్చారు. అంతే కాకుండా కేసీఆర్ పై కూడా ఉత్తమ్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇక కాంగ్రెస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కావున అందరు కాంగ్రెస్ లోకి రావాలని ఉత్తమ్ హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన ఆత్మీయ సభలో తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments