తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Sunday, April 5th, 2020, 08:54:24 PM IST


కరోనా వైరస్ మహమ్మారి పై అన్ని పార్టీలు ఏకమై ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యకు మద్దతు తెలుపుతున్నారు. కులమతాలకు అతీతంగా కరోనా కట్టడికి పోరాటం చేయాలని, ఈ వ్యాధికి మతం రంగు పులమావద్దని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ నుండి పార్టీ కీలక నేతలతో ఫేస్బుక్ లైవ్ లో ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. సహాయక చర్యల్లో సైనికుల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.అయితే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పార్టీ మద్దతు ఉంటుంది అని వ్యాఖ్యానించారు.

ఈ పోరాటంలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలని సూచించారు. అయితే లాక్ డౌన్ గత కొద్ది రోజులుగా ఉందని, దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి ప్రభుత్వం సాయం అందలేదు అని వ్యాఖ్యానించారు. అయితే 87 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సింది ఉండగా, 22 లక్షల టన్నులు మాత్రమే చేసిందని చెప్పారు. అయితే ఈ విషయాల పై త్వరలోనే గవర్నర్ ను కలిసి పరిస్తితులను వివరించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.