హాట్ టాపిక్: ఉత్తమ్ కి పోలీసుల ఆదేశం… ఒకే రోజు తెలంగాణాలో రెండు సంచలనాలు

Sunday, October 20th, 2019, 04:00:06 PM IST

తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె 16 వ రోజుకి చేరుకుంది. ఒక పక్క హుజుర్ నగర్ ఉప ఎన్నిక 21 న జరగనుంది. అదే రోజు ఆర్టీసీ కార్మికులు ప్రతి పక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మిత్ర పక్షాలు మరియు మద్దతు దారులతో ప్రగతి భవన్ ని ముట్టడి చేయనున్నారు. రెండు సంచలన పరిణామాలు ఒకే రోజు సంభవించనున్నాయి. ఇప్పటికే పోలీసులు ఉత్తమ్ కి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి. పోలీసులు ఆదేశాల్ని నిరాకరించారు ఉత్తమ్. అరెస్ట్ చేసినా హుజుర్ నగర్ వదిలి వెళ్ళను అని అన్నారు ఉత్తమ్.

అయితే ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ప్రగతి భవన్ ని ముట్టడించాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సహకరించాలని అన్నారు. కేసీఆర్ మెడలు వంచి ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేవరకు పోరాడతాం అని అన్నారు. ఇది ఇలా ఉండగా అదే రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 24 న ఓట్ల లెక్కింపు తో గెలుపొందిన అభ్యర్థి ఎవరో తెలుస్తుంది.