చమురు ధరల పై రాష్ట్ర పన్నును ప్రభుత్వం వెంటనే తగ్గించాలి – ఉత్తమ్ కుమార్

Friday, June 11th, 2021, 02:05:59 PM IST


దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రం లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో పలు చోట్ల ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే బీజేపీ కేంద్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల కారణం గా లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరింది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది లోనే పెట్రోల్ పై 25 రూపాయలు, డీజిల్ పై 24 రూపాయలు పెరిగాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే పెట్రోల్ ధరలు తగ్గించాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతలు, కార్యకర్తలు పెట్రోల్ బంక్ ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

అయితే అంతర్జాతీయం గా చమురు ధరలు తగ్గుతుంటే ఇక్కడ మాత్రం ఎక్సైజ్ సుంకం మరియు వ్యాట్ లను భారీ గా పెంచారు అంటూ విమర్శించారు. అయితే పెరిగిన చమురు ధరల పై రాష్ట్ర పన్నును తెరాస ప్రభుత్వం వెంటనే తగ్గించాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలతో దోపిడీ చేస్తున్నారు అని ఆరోపించారు. అంతేకాక 2014 లో గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు ఉంటే, ఇప్పుడు అది 860 రూపాయలకు పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు.అయితే ఈ విషయాలను బట్టి దోపిడీ ఏ మేర చేస్తున్నాయి అనేది అర్దం అవుతుంది అని చెప్పుకొచ్చారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజానీకం పై పెనుభారాలు మోపుతున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.