ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను బొందపెడితేనే ఉద్యోగాలు వస్తాయి – ఉత్తమ్ కుమార్ రెడ్డి

Friday, February 26th, 2021, 07:31:38 AM IST

తెలంగాణ రాష్ట్రం లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్య పెడుతున్నాయి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.అయితే నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా కొత్తగూడెం, మహబూబ్ బాద్ లలో ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే మతాల పరంగా సమాజాన్ని చీల్చి ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం రాముడికి అన్యాయం చేసింది బీజేపీ నే నని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ను బొండపెడితెనే ఉద్యోగాలు వస్తాయి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెరాస అభ్యర్థి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ధన ప్రవాహం తో మళ్ళీ గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల జరిగిన న్యాయవాదుల దంపతుల హత్య కి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ఉత్తమ్ డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం పార్టీ తోనే ఉన్నారు అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు.