తెలంగాణలో దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి – ఉత్తమ్ కుమార్ రెడ్డి

Sunday, May 16th, 2021, 08:34:56 PM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఇలా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రం అవుతున్న వేళ ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలి అంటూ టీపీసీసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకొని ఉచితంగా వైద్యం అందిస్తుంటే, తెలంగాణ లో మాత్రం దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ అటు ఆయుష్మాన్ భారత్ కానీ, ఇటు ఆరోగ్య శ్రీ కానీ అమలు చేయడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా కి ప్రైవేట్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకొని ఉచితంగా వైద్యం అందిస్తున్నారు అని, కానీ తెలంగాణ రాష్ట్రం లో ప్రైవేట్ ఆస్పత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే కరోనా వైరస్ నివారణకు మందులు, ఆక్సీజన్, పడకలు, వెంటిలేటర్లు అసలే లభించడం లేదని, డబ్బులు పెట్టినా పడకలు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అని అవేదన వ్యక్తం చేశారు. అయితే దేశం లో మెడికల్ హబ్ గా ఉందని, గతంలో కాంగ్రెస్, ప్రభుత్వాల ప్రోత్సాహకాల తో అనేక ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయి అని వివరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.