వైద్యం కోసం ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది – ఉత్తమ్ కుమార్

Monday, June 7th, 2021, 01:56:13 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ తో పాటుగా బ్లాక్ ఫంగస్ బాధితులు సైతం రాష్ట్రంలో పెరుగుతూనే ఉన్నారు. అయితే వారికి ఉచితంగా వైద్యం అందించాలి అని కాంగ్రెస్ పార్టీ నేత, టీపీసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. కరోనా వైరస్ కట్టడి లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అయితే అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ కూడా కోవిడ్ టీకా ను ఉచితంగా వేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష లు చేపట్టింది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే ఈ నేపథ్యం లో గాంధీ భవన్ లో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో వైద్యం కోసం ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే కరోనా వైరస్ మరియు బ్లాక్ ఫంగస్ భారిన పడిన బాధితులకు ఉచిత చికిత్స అందించాలి అని డిమాండ్ చేశారు. అయితే ఈ కార్యక్రమం లో పలువురు కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతలు పాల్గొన్నారు. అంతా కూడా కరోనా వైరస్ నిబంధనలను అనుసరించి సత్యగ్రహ దీక్షలు చేపట్టారు.