తెలంగాణ రాష్ట్ర అవిర్భవం రోజున కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం…ఉత్తమ్ కుమార్ ఆగ్రహం!

Tuesday, June 2nd, 2020, 10:01:12 AM IST

తెలంగాణ ఆవిర్భావం రోజున కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన నేతలను గృహ నిర్భంధం చేయడం, అది కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున చేయడం అప్రజాస్వామికం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఇంతకంటే దారుణం ఇక ఉండదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో జల దీక్ష ను తలపెట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ను కూడా గృహ నిర్భంధం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్ ను ఖండిస్తున్నాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ ఇళ్ళ ముందు భారీగా ఉన్నారు అని, వారు వెంటనే ఇళ్ళ ముందు నుండి వెళ్లిపోవాలి అని వ్యాఖ్యానించారు.తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా చేసుకుంటున్న ఈ దీక్షను ఇలా అడ్డుకోవడం తగదు అని, ఇలా అరెస్టులు చేయడం పాశవిక పాలన అని, ఇందుకోసమే నా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది అని మండిపడ్డారు.అయితే ఈ నేపధ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో నియంత, అసమర్థ పాలన సాగుతోంది అని అన్నారు. ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలకు తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.