డైనమిక్ మినిస్టర్.. కేటీఆర్‌పై ఉత్తమ్ ప్రశంసల జల్లులు..!

Monday, June 29th, 2020, 08:38:30 PM IST

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసల జల్లులు కురిపించారు. నిత్యం ఏదో ఒక విమర్శలు చేసుకుంటున్న నేతలు నేడు ఒకే వేదికపై కనిపించారు.

అయితే ఇక వేదికపై విమర్శలు వర్షం కురవడం పక్కా అనుకున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ రాజస్వ మండలాధికారి కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు. డైనమిక్ మినిస్టర్ అంటూ పొగడ్తలు కురిపించాడు.