మరొసారి కోదండరాంను తెరపైకి తెస్తున్న కాంగ్రెస్ !

Thursday, June 6th, 2019, 05:50:33 PM IST

గత ఎంపీ ఎన్నికల్లో నల్గొండ నుండి ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. దీంతో హుజూర్ నగర్ స్థానానికి ఉపఎన్నిక ఖాయమైంది. తాను వదులుకున్న స్థానాన్ని మరోసారి పార్టీ ఖాతాలోనే పడేలా చేయాలని ఉత్తమ్ పట్టుదలతో ఉండగా ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెరాస భావిస్తోంది.

పైగా ఆ స్థానం నుండి ఇటీవల ఎంపీ ఎన్నికల్లో ఒటమిపాలైన తన కుమార్తె కవితను బరిలోకి దింపాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఉత్తమ్ సైతం ప్రత్యర్థి ఎవరైనా నిలిచి గెలిచే వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఈ వెతుకులాటలో ఆయనకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తారసపడ్డారు. అయనైతే అన్ని విధాలా బాగుంటుందని ఉత్తమ్ అభిప్రాయపడుతున్నారట.

గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుండి పోటీచేయాలని వెనక్కి తగ్గిన కోదండరాం సైతం హుజూర్ నగర్ నుండి పోటీకి సుముఖంగా ఉన్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి హుజూర్ నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారనుంది.