గొర్రెల కాపరిదగ్గర సంజీవని..25 కోట్ల ఖర్చుతో ఉత్తరాఖండ్ సెర్చింగ్..?

Friday, September 30th, 2016, 11:34:04 AM IST

sanjeevani
భారత పురాణాలప్రకారం రామాయణంలో సంజీవని ఉపయోగించారని మనం విన్నాం. లక్ష్మణుడిని బ్రతికించడానికి ఆంజనేయుడు సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వస్తాడు.సంజీవనిని ఉపయోగించి లక్ష్మణుడిని బ్రతికిస్తారు. ఇది మనం విన్నాం.సంజీవని అనేది ప్రస్తుతం కూడా హిమాలయాల్లో ఉందని వాదించే వారి సంఖ్య పెద్దదే.ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాము సంజీవని ఆనవాళ్లు గుర్తించామని ఎప్పటినుంచో చెబుతోంది.దీనికోసం ప్రభుత్వం సెర్చింగ్ ఆపరేషన్ ని కూడా మొదలు పెట్టింది. సంజీవని నిజంగానే దొరికితే ప్రస్తుతం ఆయుర్వేదరంగంలో గొప్ప విజయం అవుతుంది.

అయితే ఇప్పటికే ఉత్తరాఖండ్ లో సంజీవని లాంటి ఆయుర్వేదాన్ని గొర్రెల కాపరుల దగ్గర గుర్తించినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది.అయితే దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి సురేంద్ర సింగ్ నేగి తెలిపారు.గతం లో 2009 లోనే దీనిపై పరిశోధనలు చేశామని కానీ అప్పుడు దీని కోసం ప్రభుత్వం పెద్దగా ఖర్చుచేయలేదని అన్నారు. కానీ ప్రస్తుతం హిమాలయాల్లో సంజీవనిని గుర్తించేందుకు దాదాపు రూ.25 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు.గొర్రెలకాపరుల వద్ద గుర్తించిన సంజీవని లాంటి ఆయురేదాన్ని పరిశోధించేందుకు కూడా ప్రభుత్వం ఖర్చు చేనున్నట్లు తెలిపారు.గొర్రెల కాపరులు దీనిని ఎవరైనా మూర్ఛపోయినపుడు, నొప్పికలిగినపుడు ఉపయోగించేవారని తెలిపారు.వారికి మంచి ఫలితాలు వచ్చేవని అన్నారు.సంజీవని మీద పరిశోధనానాలు చేయడానికి ఆయుర్వేద నిపుణులను హిమాలయాలకు పంపనున్నట్లు నేగి తెలిపారు.