క్రేజీ వీడియో : రంగమ్మ మంగమ్మ రీమేక్ లో ఉత్తేజ్ కూతురు దుమ్ము దులిపిందిగా..!

Saturday, May 5th, 2018, 12:00:49 PM IST

రామ్ చ‌ర‌ణ్, స‌మంత‌ ప్ర‌ధాన పాత్ర‌లో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగ‌స్థ‌లం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ హిట్ కొట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 200 కోట్ల వ‌సూళ్ళు సాధించింది. దేవి శ్రీ అందించిన సంగీతం, చంద్ర‌బోస్ లిరిక్స్‌తో పాటు ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, అన‌సూయ‌ల ప‌ర్‌ఫార్మెన్స్ సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయ్యాయి. మార్చి 30న విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టికి మంచి వ‌సూళ్ళ‌తో దూసుకెళుతుంది. అయితే ఈ చిత్రంలో రంగ‌మ్మ‌.. మంగ‌మ్మ అనే పాట ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

మాన‌సి పాడిన ఈ పాట‌ని చిన్న పిల్ల‌ల నుండి పెద్దోళ్ల వ‌ర‌కు తెగ పాడేసుకుంటున్నారు. కొంద‌రు స‌మంత మాదిరి స్టెప్పులు కూడా వేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్‌ని పేర‌డి చేస్తూ అల‌రించింది ఉత్తేజ్ చిన్న కూతురు పాట ఉత్తేజ్‌. ఓర‌య్యో ఓల‌మ్మా అంటూ సాగే పాట‌లో చ‌ర‌ణ్‌ని పొగుడుతూ పాట పాడిన ఉత్తేజ్ కూతురు వైవిధ్య‌మైన స్టెప్పుల‌తోను ఫిదా చేసింది. ఈ సాంగ్‌ని ఉత్తేజ్ పెద్ద‌కూతురు చేత‌న‌ డైరెక్ట్ చేయ‌డ‌మే కాకుండా, శ్రీనాథ్‌తో క‌లిసి కొరియోగ్ర‌ఫీ చేయ‌డం విశేషం. ఈ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మీరు ఈ సాంగ్‌పై ఓ లుక్కేయండి.