మీ నాన్న ప్రతిష్ట దెబ్బ తీయకు.. సీఎం జగన్‌కు వీహెచ్ సజేషన్..!

Friday, May 29th, 2020, 09:31:26 PM IST

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ ఓ సజేషన్ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో నేడు జగన్ సర్కార్‌కి హైకోర్టు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని హైకోర్ట్ తేల్చి చెప్పింది.’

అయితే దీనిపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా రమేష్ కుమార్‌ని ఎన్నికల కమీషనర్‌గా కొనసాగించి మంచి పేరు తెచ్చుకో జగన్ అని సజేషన్ ఇచ్చాడు. అంతేకాదు చెప్పుడు మాటలతో, తప్పుడు నిర్ణయాలతో మీ నాన్న ప్రతిష్ట దెబ్బ తీయకని సూచించారు. వైఎస్ కొడుకని ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టి పాలన కొనసాగించాలని, ఇది ప్రజాస్వామ్య దేశం అని జగన్ గుర్తుంచుకోవాలని అన్నారు.