వర్మ కి కౌంటర్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్

Friday, October 13th, 2017, 05:51:28 PM IST

తేజ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఏ స్థాయిలో ఉంటుందో గాని వర్మ తెరకెక్కించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం వివాదాలను ఇంకా పెంచేలా ఉంది. కేవలం లక్ష్మి పార్వతి ఎంట్రీ తర్వాత ఎన్టీఆర్ జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాలను వర్మ చూపిస్తాను అనడంతో ఇప్పటికే టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో వర్మ పై మండిపడుతున్నారు. వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే వర్మ మాత్రం అస్సలు తగ్గడం లేదు.

అయితే త్వరలో టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న వాణి విశ్వనాధ్ కూడా వర్మపై సీరియస్ అయ్యారు.
వెంటనే సినిమాను తియ్యాలనే ఆలోచనను మానుకోవాలని లేదంటే ఇండిముందు ధర్నా చేస్తామని ఆరోపించారు. అంతే కాకుండా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తీస్తుంటే ఈ తరుణంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయడం సరైనది కాదని తెలిపారు. కేవలం దురుద్దేశంతోనే వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుపుతూ.. వర్మ పెట్టిన పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్ గా వర్మ సినిమాని తెరకెక్కించడం మానుకుంటే మంచిదని ఆమె తెలిపారు.