వైరల్ ఫోటో : సైకిల్ రైడింగ్ చేస్తున్న ఐశ్వర్య రాయ్

Thursday, May 17th, 2018, 10:45:22 AM IST

మద్య కాలంలో పెళ్ళిల్లలో పోటో ఫోజులకు హద్దు అరుపూ లేకుండా పోతుంది. కొత్త కొత్త ఐడియాలతో డిఫరెంట్ ఫోజులతో అదరగొట్టే డిజైన్లతో ఆల్బంలను చేయించుకుంటున్నారు. వీళ్ళు ఫోటో షూట్ కోసం చేసే ఖర్చుతో ఒక సాదారణ కుటుంబంలో ఘనంగా పెళ్లి జరిపించవచ్చు. అంత ఖర్చు చేసి మరీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు మరి. ఇలాంటి సంఘటనే ఈ మధ్య పాట్నా సిటీలో చోటు చేసుకుంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ వివాహం అదే రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ప్రసాద్ రాయ్ మనువరాలు ఐశ్వర్య రాయ్ కి ఇచ్చి చేశారు.

ఈ నెల 12 తేదీన జరిగిన ఈ పెళ్లి ఫోటోషూట్ కోసం భారీగా ఖర్చు చేశారట. ఆ ఫోటోషూట్ లో భాగంగా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఒక పాత కాలం సైకిల్ పై పక్కనే ఉన్న వీధిలో తిరిగారట, అబ్బాయి తెలుపు రంగు కుర్తా వేసుకొని సైకిల్ తొక్కుతుంటే అమ్మాయి కాషాయం రంగు చీర కట్టుకొని ముందు కూర్చొని రొమాంటిక్ గా ఒక ఫోటో దిగారట. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోడ్డుపై ఆ కొత్త జంటను చూసిన చుట్టుపక్కన వాళ్ళు ఆ జంట నిండు నూరేళ్ళు ఆనందంగా బ్రతకాలని దీవించారట. చూశారా ఫోటో షూట్ తో పాటు దీవెనలు కూడా అందాయి మరి.