ప్రైమ్ వీడియో లోకి వచ్చేస్తున్న వకీల్ సాబ్

Tuesday, April 27th, 2021, 04:32:15 PM IST

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. అయితే ఈ చిత్రం డిజిటల్ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతోంది. అయితే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఏప్రిల్ 30 వ తేదీ నుండి స్ట్రీమ్ కానుంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను అమెజా న్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కూడా అలరించింది. పింక్ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ను న్యూ గెటప్ లో చూపిస్తూ, తెలుగు ప్రేక్షకులను అలరించడం లో వేణు శ్రీరామ్ సక్సెస్ అయ్యాడు. అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కి జోడీ గా శృతి హాసన్ నటించగా, అంజలి, అనన్య, నివేదా థామస్ లో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా లో మరొక కీలక పాత్ర అయిన నందా పాత్ర లో ప్రకాష్ రాజ్ నటించారు. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కు థమన్ సంగీతం అందించారు.