పాపం.. వంశీకి యూ టర్న్ తప్పదా ?

Sunday, June 3rd, 2018, 12:51:10 PM IST

స్టార్ రైటర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న వక్కంతం వంశీ లేటెస్ట్ గా అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మరీనా విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. అల్లు అర్జున్ మిలటరీ అధికారిగా నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. లగడపాటి శ్రీధర్, నాగబాబు నిర్మించిన ఈ సినిమాకు భారీ నష్టాలూ తలెత్తాయ్. ఈ సినిమాకు ఏకంగా పాతిక కోట్లు నష్టం వచ్చినట్టు టాక్. దాంతో దర్శకుడు వక్కంతం వంశీకి అవకాశాలు మాత్రం రాలేదు. ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో సెటిల్ సెటిల్ అవ్వాలన్న వంశీ ఆశలు నీరుగారిపోయాయి. సో ఇక అయనకు కొత్త అవకాశాలు లేవు కాబట్టి .. ఇక మళ్ళీ యూ టర్న్ తీసుకుని రైటర్ గానే సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments