వక్కంతం వంశీ నెక్స్ట్ సినిమా చరణ్ తోనేనా ?

Saturday, May 5th, 2018, 09:58:56 AM IST

అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మారాడు వక్కంతం వంశీ. ఈ సినిమా నిన్న విడుదలై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు ముందే ఈ దర్శకుడు తన తదుపరి చిత్రానికి అన్ని పనులు పూర్తీ చేసినట్టు తెలుస్తోంది. అవును అయన నెక్స్ట్ సినిమా చరణ్ తో ఉంటుందని టాక్ ? ఎందుకంటే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య కథ చెప్పే సమయంలో అతని కమిట్మెంట్ నచ్చిన అల్లు అరవింద్ తదుపరి సినిమాకూడా గీత ఆర్ట్స్ లో చేయాలనీ ఒప్పందం తీసుకున్నాడట.

ఈ నేపథ్యంలో అయన చరణ్ కోసం కూడా ఓ కథను సిద్ధం చేసాడని .. దానికి సంబందించిన చర్చలు కూడా చరణ్ తో జరిగినట్టు తెలుస్తోంది. అంటే వంశీ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత మరో రెండు కమిట్మెంట్స్ ఉన్న నేపథ్యంలో వంశీ తో సినిమా ఎప్పుడు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే !