అసలే ప్రేమికుల రోజు – ఇక్కడేమో వెలవెలబోతున్న పార్కులు…

Friday, February 14th, 2020, 06:46:54 PM IST

నేడు ప్రపంచం అంతా కూడా ఒక వైపు ప్రేమికుల దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా చోట్ల పార్కులు, హోటళ్లు, ప్రముఖ ప్రాంతాల్లో సందడి చేస్తూ తిరుగుతున్నారు. కానీ హైదరాబాద్ లోని పార్కులు మాత్రం ఇప్పటికి కూడా వెలవెల బోతున్నాయి… ఎప్పుడైనా కానీ ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు నగరంలోని పార్కులన్నీ కూడా కళకళలాడుతూ కనిపించేవి. కానీ కానీ నేడు మాత్రం పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇప్పటికే చేసిన పలు హెచ్చరికలు కారణమనే వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.

అయితే సాధారణంగా ప్రేమికుల రోజు నాడు ఎవరైనా జంటలుగా కనిపిస్తే వారికి అక్కడికక్కడే పెళ్లి చేయడంతో పాటు, వారి తల్లిదండ్రులని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. ఈసారి కూడా అలాగే చేస్తామని పలు సంఘాలు హెచ్చరికలు చేయడంతో పార్కుల్లోకి వచ్చే యువత కూడా కనిపించకపోవడం గమనార్హం. అయితే ఇదే అదనుగా చేసుకొని రెస్టారెంట్లు, హోటళ్లు బాగా నిండిపోయాయని తెలుస్తుంది.. ఏదేమైనప్పటికీ కూడా వారు కలిసే ప్రదేశము మారింది కానీ, వారు మాత్రం మారలేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.