ఆ రెండూ మహేష్ మూవీ టైటిల్స్ కాదు !

Friday, October 27th, 2017, 11:50:32 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం నిరాశ పరిచింది. దీనితో ఫాన్స్ ని సంతృప్తి పరిచేందుకు చకచకా సినిమాలు చేసేస్తున్నాడు. మహేష్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తరువాత మహేష్ వంశి పైడి పల్లి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. కాగా ఈ చిత్రానికి సంబందించిన కొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మహేష్- వంశీల చిత్రానికి ‘కృష్ణ ముకుందా మురారి’ మరియు ‘హరే రామ హరే కృష్ణ ‘ వంటి టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలని దర్శకుడు వంశి పైడిపల్లి ఖండించారు. మహేష్ మూవీ కి ఇంకా ఎటువంటి టైటిల్ ఫిక్స్ చేయలేదని తెలిపారు. చిత్రానికి సరిపడే టైటిల్ ని త్వరలోనే ప్రకటిస్తామని వంశి పైడిపల్లి తెలిపారు.