ఆ దర్శకుడికి… మహేష్ హ్యాండిచ్చినట్టేగా !!

Tuesday, November 22nd, 2016, 03:52:27 PM IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనీ ఎవరు ప్రయత్నం చేయరు చెప్పండి. అలాగే ఆ దర్శకుడు కూడా మహేష్ తో సినిమా చేయాలనీ తెగ ప్రయత్నాలు చేసాడు? అతని హిట్ చూసి తప్పకుండా తనతో సినిమా చేస్తానని చెప్పాడు మహెష్ .. కానీ ఇంతవరకు ఆ సినిమాకు సంబందించిన ప్రయత్నాలేవీ వర్కవుట్ కావడం లేదు? ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో అర్థం అయిందా … ఆయనే ”ఊపిరి” సినిమాతో హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి? ఆ సినిమా తరువాత మహేష్, వంశీ లతో పివిపి బ్యానర్ లో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం పై పివిపి కూడా ప్రకటించాడు. కానీ వంశీకి మాత్రం మహేష్ టైం ఇవ్వడం లేదట !! ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత అయన వెంటనే కొరటాల శివ కు ఓకే చెప్పాడు, దాని తరువాత త్రివిక్రమ్ సినిమా పట్టాలు ఎక్కనుంది …. ఈ లెక్కన వంశీ ఇంకా మహేష్ లిస్ట్ లోకి ఎంట్రీ అవ్వలేదు .. అంటే ఇన్నాళ్లు సినిమా చేస్తానని చెప్పిన మహేష్, వంశీ కి హ్యాండ్ ఇచ్చినట్టే అని అంటున్నాయి సినీ వర్గాలు !!