టీడీపీ కి ఇక మూడింది…అసలు విషయాల్ని బయటపెట్టిన వంశీ!

Monday, November 18th, 2019, 12:20:35 PM IST

తెలుగుదేశం పార్టీ ని వీడినప్పటినుండి వల్లభనేని వంశీ గురించి ఆంధ్ర ప్రదేశ్ లో చర్చలు మొదలయ్యాయి. వైసీపీ లోకి చేరతారా? రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని చర్చలు జరిగాయి. అయితే టీడీపీ ఫై ఎవరి ఊహించని రీతిలో విమర్శలు చేయడం ప్రారంభించారు వల్లభనేని వంశీ.

సోషల్ మీడియా లో వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించిన వల్లభనేని వంశీకి దిమ్మ తిరిగే షాక్ తగిలిందట. వంశీ ఇంటెలెజిన్స్ వర్గాల్ని అడగగా టీడీపీ 50 వెబ్ సైట్లని నడుపుతుందని సమాచారమివ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు. తన పై బురదజల్లే ప్రయత్నం చేసింది టీడీపీ కావడం తో వంశీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు.

సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని పట్టించుకోను అని చెప్పిన వంశీ అసలు విషయాలు వెల్లడించారు. ఇది మాములుగా జరిగితే ఎవరైనా ఇంతగా బాధపడరు. కానీ, ఇది చాల ఆర్గనైజ్డ్ గా జరగడం తో బాదపడ్డానని అన్నారు. అయితే రాబోయే కాలంలో ఎన్టీఆర్ టీడీపీ లోకి వస్తే ఎక్కడ మద్దతుని ఇస్తానో అని ఇలా చేసారని అభిప్రాయం వ్యక్తం చేసాడు. అంతే కాకుండా ఎన్టీఆర్ ఫ్యామిలీ కు సంబంధించి ఎన్టీఆర్ లేదా బాలకృష్ణ టీడీపీ పగ్గాలు చేపడితే బావుంటుందని, వాళ్ళకి మాత్రమే ఫైర్ ఉందని, లోకేష్ కి లేదని వంశీ అన్నారు.