వైసీపీ పాలనలో మహిళల రక్షణకు కరువయ్యింది – వంగలపూడి అనిత

Sunday, October 18th, 2020, 07:40:22 PM IST

టీడీపీ నేత వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై మండిపడింది. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై 300లకు పైగా దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా యర్రంపాడులో బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారం చేశాడని కానీ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశ చట్టం అనలు కావడం లేదని అన్నారు.

రాష్ట్రంలో వైసీపీ వాలంటీర్ల ఆగడాలకు అంతులేకుండా పోయిందని అన్నారు. దిశ బిల్లును వెనక్కి పంపిన కేంద్రం, బిల్లులో లోపాలు, అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిందని అన్నారు. దిశా చట్టంపై వైసీపీ ప్రభుత్వం ప్రచారంపై చూపిన శ్రద్ధ మహిళల భద్రతపై ఎందుకు చూపడం లేదని నిలదీశారు. అయితే దిశ బిల్లు వెనక్కి రావడంతో బిల్లు వెనక్కి రావడంతో మళ్లీ అసెంబ్లీలో పెట్టి ఆమోదించిన తర్వాతే కేంద్రానికి పంపాల్సి ఉంటుందని అన్నారు.