కోడెల మరణ వార్త విన్నాక వంగవీటి సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, September 18th, 2019, 03:00:11 AM IST

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిన్న చనిపోయారు. వరుస కేసుల విషయంలో మానసికంగా బాగా కుంగిపోయిన కోడెల నిన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. అయితే కోడెల ఆత్మహత్యపై స్పందించిన టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అయితే కోడెల మృతి పట్ల బీజేపీ నేత వంగవీటి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల చావుతో మేమంతా సంతోషంగా ఉన్నామని, 30 ఏళ్ల క్రితం బందరు రోడ్డులో పేదల ఇళ్ల పట్టాల కోసం వంగవీటి రంగా నిరాహార దీక్షకు దిగారు. అలాంటి ప్రజా నాయకుడిని టీడీపీ ప్రభుత్వ హయాంలో అతిదారుణంగా హత్య చేసి చంపారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు కోడెల హోంమంత్రిగా ఉండి జిల్లా ఎస్పీ సాయంతో 3 సార్లు రంగా శిబిరం వద్ద రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో చంపేసారని అన్నరు. పోలీస్ శాఖలో రంగాకు అనుకూలంగా ఉన్న 300 మందికిపైగా పోలీసులను వారం రోజుల ముందే బదిలీ చేసారని ఆరోపించారు. ఇలా కుట్రపూరితంగా రంగా చావుకు కారణమైన ముఖ్యమైనవారిలో కోడెల ఒకరని ఆయనకు తగైన శాస్త్రే జరిగిందని అన్నాడు. కొడెల చావు వార్త విన్నాక మేమంతా సంతోషంగా ఉన్నామని చెప్పారు.