సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారు.. వంగవీటి రాధా సంచలనం..!

Tuesday, January 14th, 2020, 05:34:41 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత వంగవీటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీనీ వీడి టీడీపీలో చేరిన రాధా మొన్నటి వరకు సైలెంట్‌గానే ఉన్నా అమరావతి విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వంపై సీరియస్ అవుతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరు మహిళలు నేడు ఆందోళన చేపట్టారు.

అయితే మహిళల ఆందోళనలకు మద్ధతుగా వంగవీటి రాధా కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వంగవీటి రాధా జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలపై పోలీసుల చేత లాఠీ ఛార్జ్ చేయించడంపై ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఏ జిల్లాలో అయితే జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అదే జిల్లాకు జగన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వైసీపీ 30 రాజధానులు అనుకున్నా, తమకు తెలిసింది మాత్రం ఒకటే రాజధాని అని, ఒకటే రాష్ట్రం అని మహిళలు రాధాతో చెప్పుకున్నారు. అయితే వంగవీటి మాత్రం ఏమీ భయపడాల్సిన అవసరం లేదని రాజధానిని వైసీపీ మార్చలేరని అన్నారు. అయితే చాలా రోజుల తరువాత రాజధాని రైతులకు రాధా మద్ధతు తెలపడంతో అటు రైతులు, మహిళలలో మరింత ధైర్యం నెలకొంది.