బిగ్ బ్రేకింగ్ : వంగవీటి రాధా మరో సంచలన నిర్ణయం!?

Sunday, June 9th, 2019, 03:49:19 PM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఓటమితో చాలా మంది కీలక నేతల రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టవేయబడిందని చెప్పాలి.అలాంటి ప్రముఖమైన నేతల్లో వంగవీటి రాధా కూడా ముందుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.రాజకీయ నాయకునిగా రాధ అసలు ఎక్కడా నిలకడ చూపలేదు.అందులో భాగం గానే రాధా తాను అప్పటివరకు ఉన్న వైసీపీ పార్టీను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.అందులోనూ ఆ పార్టీను వీడుతూ జగన్ పై సంచలనం రేపే వ్యాఖ్యలు చేసి వెళ్లిపోయారు.తెలుగుదేశం పార్టీలో కీలక పదవి తనకి దక్కుతుందని భావించి ఆ పార్టీలోకి జంప్ అవ్వగా అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యిపోయింది.

దీనితో ఇప్పుడు రాధాకు రాజకీయ భవిష్యత్తు పూర్తిగా శూన్యంగానే కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.మంచో చెడో ఆయన అదే వైసీపీలో కానీ కొనసాగి ఉన్నట్టయితే ఈ పాటికి అదే పార్టీలో ఒక కీలక స్థానములో ఖచ్చితంగా ఉండేవారని అలాగే ఆయన ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరితే అక్కడ వారు కనీసం సీటు కూడా ఇవ్వకపోగా అతన్ని ప్రచారానికి మాత్రమే పరిమితం చేసారని అంతా అంటున్నారు.నిజానికి ఇప్పుడున్నా పరిస్థితుల్లో రాధా తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏమన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీ నుంచి వైదొలగడమే అని అంతా అంటున్నారు.అందువల్ల రాధా ఇక తన భవిష్యత్తు రాజకీయాలపై ఒక సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్న సూచనలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇప్పుడు ఎలాగో టీడీపీలో ఉన్నా సరే ఆ పార్టీ పరిస్థితే అధోగతిలో ఉండడం అలాగే జనసేన పార్టీలోకి పవన్ ఎప్పుడో వద్దని చెప్పడం రాధా పనిచేసిన వల్ల ఇక జగన్ కూడా మళ్ళీ వారి పార్టీలో చేర్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేకపోవడం వల్ల రాధా ఇక రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం తప్ప మరోదారి అతని ముందు లేదని అందుకే రాధా ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం తప్ప మరో దారి కనిపించడం లేదని తెలుస్తుంది.మరి రాధా నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటారో లేదో చూడాలి.