దయచేసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీయొద్దు..వర్మని వేడుకొన్న అలనాటి నటి..!

Sunday, October 15th, 2017, 10:41:16 PM IST

ఎందరు ఎన్నిరకాలు కామెంట్లు చేస్తున్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం బయోపిక్ విషయంలో వర్మ తనదారిలో తాను వెళుతున్నాడు. ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీస్తే తాను వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతానని అలనాటి నటి వాణి విశ్వనాథ్ హెచ్చరించారు. దానికి వర్మ కూడా కౌంటర్ వేశారు. కానీ తాజగా ఆమె వర్మని రిక్వస్ట్ చేశారు. దయచేసి వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని విరమించుకోవాలి. ఇదేనా వినయపూర్వక అభ్యర్థన అని వాణి విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.

ఎన్టీఆర్ జీవితమేమి సామాన్యమైనది కాదు. అది ఓ మహా సముద్రం అని ఆమె అభివర్ణించారు. అలాంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఆయన వ్యక్తిగత అంశాలని టార్గెట్ చేయడం ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగించడమే అవుతుంది. ఇలాంటి చర్యలు ఎన్టీఆర్ అభిమానులని ఎంతగానో బాధిస్తాయని వాణి విశ్వనాథ్ అన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. వాణివిశ్వనాథ్ టిడిపిలో చేరేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ఆదిశగా సంకేతాలు కూడా ఇస్తున్నారు. పార్టీలో చంద్రబాబు ఏపని అప్పగించినా చేసేందుకు తాను సిద్ధం అని వాణి విశ్వనాథ్ ఇదివరకే ప్రకటించారు.