రాజ‌కీయాల్లోకి వ‌ర‌ల‌క్ష్మీ.. ముహుర్తం ఎప్పుడంటే..?

Wednesday, October 31st, 2018, 02:19:02 PM IST

త‌మిళ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఇటీవ‌ల్ పందెంకోడి-2 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ పాత్ర‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా ఈ బొద్దుగుమ్మ విజ‌య్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న స‌ర్కార్ చిత్రంలో కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ నేప‌ధ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చిన వ‌ర‌ల‌క్ష్మీ కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాలు చెప్పింది.

విశాల్‌కి త‌న‌కి మ‌ధ్య ఎఫైర్ రూమ‌ర్స్ పై స్పందించిన వ‌ర‌ల‌క్ష్మీ.. విశాల్ త‌న‌కు మంచి స్నేహితుడు మాత్ర‌మే అని.. అత‌నితో తాను డేటింగ్ చేయ‌డం లేద‌ని.. తామిద్ద‌రం అన్ని విష‌యాలు చ‌ర్చించుకుంటామ‌ని.. అందరూ అనుకుంటున్న‌ట్లు మా మ‌ధ్య ల‌వ్ ఎఫైర్ లేద‌ని వ‌ర‌ల‌క్ష్మీ తేల్చి చెప్పింది. ఇక విశాల్‌ని పెళ్లి చేసుకోమ‌ని చాలా సార్లు చెప్పాన‌ని.. ఇక అత‌నికి చెప్ప‌డం నా వ‌ల్ల కాద‌ని వ‌ర‌ల‌క్ష్మీ తెలిపింది. ఇక త‌న‌కు డైరెక్ష‌న్ అంటే చాలా ఇష్ట‌మ‌ని.. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేస్తాన‌ని చెప్పింది. ఇక చివ‌రిగా త‌న‌కు రాజ‌కీయాలు అంటే కూడా ఇంట్ర‌స్ట్ ఉంది అని.. ఐదు, ఆరు సంవ‌త్స‌రాలు త‌ర్వాత పాలిటిక్స్‌లో జాయిన్ అవుతాన‌ని వ‌ర‌ల‌క్ష్మీ ఆశ‌క్తిక‌ర విష‌యాలు చెప్పింది.

  •  
  •  
  •  
  •  

Comments