వ‌ర‌ల‌క్ష్మి మ‌రో నీలాంబ‌రి కాబోతోందా?

Saturday, September 1st, 2018, 06:37:27 PM IST

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – ర‌మ్య‌కృష్ణ కాంబినేష‌న్ మూవీ న‌ర‌సింహా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రంలో ర‌మ్య నీలాంబ‌రి పాత్ర‌లో న‌టించి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీతో పోటీప‌డి న‌టించింద‌న్న పేరొచ్చింది. ఇప్ప‌టికీ తమిళ్‌, తెలుగులో ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు అదే త‌ర‌హాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ పేరు తెచ్చుకోనుందా?

విశాల్ క‌థానాయ‌కుడిగా లింగుస్వామి తెర‌కెక్కించిన పందెం కోడి అక్టోబ‌ర్ 18న‌ రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ట్రైల‌ర్‌ని ఇటీవ‌ల లాంచ్ చేశారు. ట్రైల‌ర్ యూట్యూబ్‌లో ల‌క్ష‌ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. విశాల్ నుంచి మ‌రో ప్రామిస్సింగ్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని చూడ‌బోతున్నామ‌ని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్య ంగా ఈ ట్రైల‌ర్‌లో విశాల్ మాస్ అప్పీల్‌, కీర్తి సురేష్ న‌ట‌నాభిన‌యం ఆక‌ట్టుకున్నాయి. అంత‌కుమించి ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ అప్పియ‌రెన్స్ ప్రేక్ష‌కుల‌కు సంథింగ్ స్పెష‌ల్ గా స్ట్రైక్ అవ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ర‌జ‌నీకాంత్ న‌ర‌సింహా చిత్రంలో నీలాంబ‌రి రేంజు పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మి న‌టిస్తోందా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ట్రైల‌ర్‌తో తొలి ఇంప్రెష‌న్ ప‌డింది. సినిమా ఏ స్థాయిలో ఆక‌ట్టుకుంటుందో చూడాలి.ముఖ్య ంగా విశాల్ .. త‌న స్నేహితురాలు వ‌ర‌ల‌క్ష్మి మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ ఏ రేంజులో ఉండ‌బోతోందో చూసి తీరాలి.

  •  
  •  
  •  
  •  

Comments