ప్రేయసే.. విలన్ గా మారితే ?

Sunday, May 13th, 2018, 04:22:49 AM IST


ఏంటి ప్రేమించిన అమ్మాయి విలన్ గా మారితే పరిస్థితి ఏమిటి అని షాక్ అవుతున్నారా ? నిజమే .. అతగాడి పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదుర్కోనున్నాడు కోలీవుడ్ స్టార్ విశాల్ !! గత కొన్ని రోజులుగా హీరో విశాల్, ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి తో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి .. శరత్ కుమార్ కు హీరో విశాల్ కు మధ్య గొడవలు కూడా జరిగాయి .. ఆ తరువాత ఈ వ్యవహారం పై పెద్దగా వార్తలు రావడం లేదు. ఈ విషయం పక్కన పెడితే తాజగా హీరో విశాల్ నటిస్తున్న సినిమాలో విలన్ పాత్రలో వరలక్ష్మి నటిస్తుందట. హీరో విశాల్ కు మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చిన పందెంకోడి సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో లేడి విలన్ ఉంటుందని, ఆ పాత్ర కోసం వరలక్ష్మి ని సంప్రదించినట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments