ఆ హీరో కూతురికీ లైగింక వేధింపులు తప్పలేదట !!

Monday, February 20th, 2017, 10:29:05 PM IST


లేటెస్ట్ గా తమిళ హీరోయిన్ భావన కిడ్నప్, లైంగిక వేధింపుల విషయం సంచలనం అయింది. ఈ విషయంతో చాలా మంది అమ్మాయిలు కూడా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటికి చెబుతున్నారు ? ఓక హీరోయిన్ అయితే ఇండియాలో అసలు మహిళలకు సేఫ్టీ లేదని చెప్పి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ విషయం పై స్పందించిన శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కి కూడా ఇలాంటి లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పి షాక్ ఇచ్చింది!! తమిళంలో ప్రముఖ నటుడిగా ఉన్న శరత్ కుమార్ కూతురు ఇలా చెప్పడం నిజంగా సంచలనం రేపే విషయమే అని చెప్పాలి. తాను లైగిక వేధింపులకు గురయిన విషయం చెబుతూ … ఇటీవలే ఓ టివి ఛానల్ కు వెళ్ళినప్పుడు అక్కడి ప్రోగ్రాం హెడ్ అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో అక్కడినుండి బయటికి వచ్చానని అన్నారు. అతడు దారుణంగా మాట్లాడాడని, ఆ తరువాత ట్విట్టర్ ద్వారా వేధింపులకు గురిచేసాడని అన్నారు. చిత్ర సీమలో హీరోయిన్స్ కు వేధింపులు ఎక్కువగానే ఉన్నాయని అన్నారు .

ట్విట్టర్ లో ఈ విషయం పై స్పందిస్తూ సమాజంలో ఎం జరుగుతుందో తెలియడం లేదని, మహిళల భద్రత అనేది జోక్ గా మారిపోయిందని ఆమె మండి పడ్డారు. ఈ విషయాన్నీ చెప్పాలా వద్ద అనే విషయం పై రెండు రోజులుగా మధన పడుతున్నట్టు పేర్కొన్నారు? అలాగే మరో సంఘటన గురించి చెబుతూ .. తాను ఓ ప్రముఖ టివి ఛానల్ ప్రొగ్రమింగ్ హెడ్ తో సమావేశంలో పాల్గొన్నానని, ఒక అరగంట ముగుస్తుందనగా అతను మనం బయట ఎక్కడ కలుద్దాం అని అడిగాడని, ఏదైనా పని ఉందేమో అని దేని గురించి అని అడిగితె .. వేరే విషయం గురించి అని చెప్పాడు., దాంతో తానూ కోపంగా బయటికి వెళ్లి పోయానని చెప్పింది. పరిశ్రమలో తాను శరీరాన్ని అమ్ముకోవడానికి రాలేదని, నటన అంటే ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చామని, మహిళలపై జరుగుతున్నా దారుణాలు మాములుగా లేవని బాగా సీరియస్ అయింది?