ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సర్కార్ – వరవరరావు

Wednesday, June 5th, 2013, 10:01:06 PM IST


గత కొన్ని రోజులుగా దేశం మావోయిస్టుల హింసా కాండ తో దద్దరిల్లి పోతోంది. ముఖ్యంగా చత్తీస్ ఘడ్ అట్టుడికి పోతోంది. ఇలాంటి తరుణంలో కూడా ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివిఉండకూడదని ప్రధాని అంటున్నారు. వీటన్నిటినీ చూసి స్పందించిన విప్లవ రచయిత, విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, చిదంబరం లాంటి నాయకులపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ ‘ దేశంలో ప్రజాస్వామ్యం అనే దాన్ని ఖూనీ చేస్తున్న సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం లాంటి వారు ప్రజాస్వామ్యం, వాటి విలువల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకవైపు ఆదివాసులపై కేంద్ర బలగాలతో యుద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో వైపేమో ఏమీ తెలియనట్టు మావోయిస్టులు అనే పేరు పెట్టి చత్తీస్ ఘడ్ లోని గ్రామ ప్రజలని హింసిస్తున్నారు. కొత్త గూడెంలో అరెస్టైన మాధవి, స్టూడెంట్ పృథ్విలను వెంటనే హాస్పిటల్ కి తరలించి, వారి పై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని’ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.