విప్లవ కవి వరవరరావుకు అస్వస్థత.. జైలు నుంచి ఆసుపత్రికి..!

Saturday, May 30th, 2020, 12:46:47 AM IST

విప్లవ కవి వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది హుటాహుటిన ఆయనను నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు.

అయితే పూణె నగరంలోని విశ్రంబాగ్ పోలీస్ స్టేషన్ వర్గాలు ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలియపర్చగా వారు వెంటనే ఈ విషయాన్ని వరవరరావు కుటుంబసభ్యులకు తెలియజేశారు. అంతేకాదు వరవరరావు కుటుంబ సభ్యులను ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అనుమతిచ్చారు. అయితే వరవరరావును ఉంచిన జైల్లో కొందరు ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో వరవరరావుకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్‌లు రావాల్సి ఉంది.