సిటీ లోని ఒక మహిళా కాలేజీలో వెరైటీ నిబంధన

Tuesday, September 17th, 2019, 02:39:57 AM IST

హైదరాబాద్ లోని ఒక మహిళా కాలేజీలో, ఆ కాలేజి యాజమాన్యం ఒక వింతైన నిబంధనను పెట్టింది. హైదరాబాద్ లో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో యాజమాన్యం పెట్టిన నిబంధనకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద గొడవలు జరుగుతున్నాయి… కాగా ఆ కాలేజీలో చదువుకునే అమ్మాయిలు అందరు కూడా త్మా మోకాళ్ళ వరకు దాటినా కుర్తాను మాత్రమే ధరించాలని, స్లీవ్ లెస్ కుర్తాలు, షార్ట్స్, జీన్స్, వంటి దుస్తులు ధరించడం నిశేదించారు. అయితే ఎవరైతే విద్యార్థులు ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తారో వారిని ఆ కాలేజీలోకి అనుమతించేది లేదని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల యాజమాన్యం ఖరాఖండీగా తెగేసి చెప్పింది.

కాగా ఆలా ఎవరైనా వస్తే మాత్రం వారిని కాలేజీ గేటు నుండి బయటకు పంపిస్తున్నారు. అయితే అలా కాలేజీ గేటు నుండి వెనక్కి పంపిస్తున్నటువంటి ఒక వీడియో ప్రస్తుతానికి వైరల్ గా మారిందని చెప్పాలి. అయితే ఆ నిబంధనని ఎత్తేయాలని పలు విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి… దానితోపాటే బాలల హక్కుల సంఘం కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆ నిబంధన మంచిదే అని పలువురు తల్లిదండ్రులు సదరు కాలేజీ యాజమాన్యానికి మద్దతు తెలుపుతున్నారు.