రాష్ట్ర బందుకు మద్దతు తెలిపిన వివిధ సంఘాలు – చిక్కుల్లో ప్రభుత్వం…?

Friday, October 18th, 2019, 11:06:51 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రస్తుతానికి ఉదృతంగా మారనుంది. అయితే ఆర్టీసీ కార్మికులు ముందడుగు వేసి రాష్ట్ర బందుకు పిలుపునిచ్చారు. కాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్నటువంటి ఈ సమ్మెకు రాష్ట్రం లోని అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 14వ రోజు కి చేరుకుంది. తమ డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీ రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు ప్రకటించాయి. కాగా ఈ నేపథ్యంలో కొన్ని రెవెన్యూ సంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపాయి.

కాగా ఆర్టీసీ కి డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహసీల్దార్ల సంఘంతో సహా మరో 6 రెవెన్యూ సంఘాలు మద్దతుగా నిలబడ్డాయని అధికారికంగా ప్రకటించారు. అయితే వీటికి తోడు ఆటో యూనియన్లు, క్యాబ్‌ డ్రైవర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌, భాజపా, తెదేపా, తెలంగాణ జనసమితి, సీపీఐ, సీపీఎం పార్టీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటున్నాయి. రేపు జరగబోయే బంద్ ని విజయవంతంగా పూర్తిచేయాలని అన్ని వర్గాల ప్రజలకు మరియు, ప్రజా సంఘాలకు TSRTC JAC నేత అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు.