మీరు ఈరోజు ట్రైలర్ మాత్రమే చూసారు – వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

Thursday, February 27th, 2020, 02:39:18 PM IST

విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకోవడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ఫై చెప్పులు, కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేయడం పట్ల వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. గతంలో అధికార పార్టీ నేతలు విచ్చేసే సమయం లో టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసిన సంగతిని వర్ల రామయ్య గుర్తు చేసారు. ఇపుడు ముందస్తు జాగ్రత్త చర్యలు గా వైసీపీ నేతల్ని ఎందుకు హౌజ్ అరెస్ట్ చేయలేదని అధికార పార్టీ ని నిలదీశారు.

9 నెలల్లో జగన్ పాలనలో ఈరోజు బ్లాక్ డే గా పరిగణిస్తారని వర్ల రామయ్య అన్నారు. అయితే ఎంతో ప్రశాంత, సోదరభావం తో ఉండే వైజాగ్ ఈరోజు జరిగిన దాడితో విశాఖ వాసులు ట్రైలర్ మాత్రమే చూసారని, ఇంకా మున్ముందు సినిమా చూస్తారని, ప్రజలు గమనించాలని వర్ల రామయ్య అన్నారు. అక్కడి మహిళలకు రూ. 500 ఇచ్చి నిరసనకు తీసుకొచ్చారని వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేసారు. బొత్స చంద్రబాబు పర్యటన నుద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. హైకోర్టు జగన్ ప్రభుత్వాన్ని ఎంత హెచ్చరిస్తున్న బేఖాతరు చేయకుండా పరిపాలిస్తున్నారని విమర్శించారు.