బిగ్ న్యూస్: మంత్రి కొడాలి నాని కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వర్ల రామయ్య

Friday, November 22nd, 2019, 04:35:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మాటల యుద్ధం నడుస్తుంది. నిన్నా మొన్నటి వరకు రాజకీయ విమర్శలు చేసిన రాజకీయ పార్టీలు హద్దులు దాటుతున్నాయి. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో టీడీపీ తీవ్ర మనస్తాపానికి లోనయ్యింది. కొడాలి నాని వ్యాఖ్యల్ని ఖండిస్తూ వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి కొడాలి నాని ని బూతుల మంత్రి కొడాలి నాని అంటూ సంబోధించారు. మంత్రి బూతులు మాట్లాడినంత మాత్రాన చట్టాలు మారతాయా? అంటూ ప్రశ్నించారు.

అయితే కొడాలి నానిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసారు వర్ల రామయ్య. కొడాలి నాని చదువు లేకపోవడం వల్లనే ఆ విధంగా మాట్లాడాను అని ఒప్పుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేసారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అయితే కొడాలి నాని వ్యాఖ్యల ఫై జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తిరుమల లోపలి డిక్లరేషన్ లేకుండా వెళ్లడం పట్ల టీటీడీ ఫై అభ్యంతరం వ్యక్తం చేసారు. జగన్ ఫై ఎలాంటి చర్యలు తీసుకుంటారని టీటీడీ ని ప్రశ్నించారు.