మోసం చేయటం జగన్ నైజం.. టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు..!

Sunday, July 12th, 2020, 03:00:40 AM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నమ్మించి మోసం చేయడం, నట్టేట ముంచటం జగన్ నైజమని అన్నారు.

అంతేకాదు స్వకార్యం కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం జగన్ సొంతమని ఎద్దేవా చేశారు. అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడారని, ప్రతి ఒక్కరిని వాడుకున్నారని అన్నారు. ఏడాది పాలనలో టీడీపీ నేతలపై కక్ష్య సాధింపు పనులతోనే సరిపెట్టుకున్నారని, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు చేసిందేమి లేదని ఆరోపించారు.