మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేయాలి.. వర్ల రామయ్య డిమాండ్..!

Tuesday, September 22nd, 2020, 12:06:33 AM IST


ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస ఘటనలు, తిరుమల డిక్లరేషన్ అంశానికి సంబంధించి నిన్న మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కొడాలి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు.

అయితే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు హిందూ ధర్మ వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. మతాల మధ్య చిచ్చు రేపే విధంగా మాట్లడడం తగదని వెంటనే మంత్రి కొడాలి హైందవ లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రిపై సెక్షన్ 153ఆ ఈఫ్ఛ్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అన్నారు.