ఏపీ సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా సెటైర్లు గుప్పించారు. ఏపీని అవినీతిరహిత రాష్ట్రంగా సీఎం జగన్ నడిపిస్తున్నారని విజయసాయి అంటున్నారని అన్నారు. సరే చెప్పినట్టుగానే ఏపీని అవినీతిరహిత రాష్ట్రంగా నడిపిస్తున్న సీఎం జగన్, ఆయనని అభినందించిన విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా భారతదేశంలోనే అత్యంత పెద్దదయిన అవినీతికేసులో ఆ1,ఆ2 ముద్దాయిలుగా కోర్టు విచారణలో ఉన్నారని వర్ల రామయ్య అన్నారు. అయితే ఈ కేసులో నేరం రుజువైతే వారిద్దరు ఎన్నో ఏళ్ళు జైలుకెళ్తారని అన్నారు.
మనరాష్ట్రాన్ని,అవినీతి రహిత రాష్ట్రంగా సిఎం జగన్ నడిపిస్తున్నారు అని వీసారెడ్డి అన్నారు.మరి, నడిపిస్తున్న జగన్, అభినందించిన వీసారెడ్డి, ఇద్దరు,భారతదేశంలోనే, అత్యంత పెద్దదయిన అవినీతికేసులో A1,A2 ముద్దాయిలుగా కోర్టు విచారణలో వున్నారు. నేరం రుజువైతే ఎన్నోఏళ్ళు జైలుకెళ్తారు గదా?
.
— Varla Ramaiah (@VarlaRamaiah) January 8, 2021