జగన్ ప్రధానితో అందుకే భేటీ అయ్యారు.. టీడీపీ నేత వర్ల రామయ్య..!

Wednesday, February 12th, 2020, 11:36:07 PM IST

ఏపీ సీఎం జగన్ నేడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీపై స్పందించిన టీడీపీ నేత వర్ల రామయ్య ప్రధాని మోదీతో సీఎం జగన్ చేసుకున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు.

అయితే సీబీఐ కేసులు, వ్యక్తిగత హాజరు మినహాయింపు, మండలి రద్దు, మూడు రాజధానుల అంశాలపై చర్చించేందుకే సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళారని అన్నారు. అయితే వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి ఏపీ అభివృద్ధిపై జగన్ దృష్టి పెట్టాలని వర్ల రామయ్య అన్నారు. పోలవరం, రైల్వే జోన్‌, కేంద్ర విద్యా సంస్థలు, పెండింగ్‌లో ఉన్న కాపుల రిజర్వేషన్ వంటి అంశాలను ప్రస్తావించారో లేదో చెప్పాలని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రధాని మోదీతో భేటీనీ వృథా చేశారని అన్నారు.