వాణి విశ్వనాధ్ కు వర్మ కౌంటర్..మీ పాదాలు కమిలిపోతాయి

Friday, October 13th, 2017, 10:44:27 PM IST


రామ్ గోపాల్ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా తర్వాత ఏ స్థాయిలో రిజల్ట్ ని చూస్పిస్తుందో గాని ప్రస్తుతం వివాదాలను మాత్రం రేపుతోంది. ఇప్పటికే వర్మ పై టీడీపీ నాయకులు చాలా కోపంతో ఉన్నారు. వార్నింగ్ లు కూడా ఇచ్చారు. ఈ సినిమాపై రోజుకు ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వర్మ కూడా వారికి తన స్టైల్ లో కౌంటర్ వేస్తున్నాడు. రీసెంట్ గా సీనియర్ నటి వాణి కపూర్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వర్మ ఆ ఆమె అన్న కామెంట్స్ ని తన ఫెస్ బుక్ లో పోస్ట్ చేసి వాటికి సరైన కౌంటర్ కూడా వేశాడు. వర్మ ఈ విధంగా కౌంటర్ వేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వాణి విశ్వనాథ్

ఎన్టీఆర్ విరాభిమానిగా , ఆయన సినిమా ఆఖరి హీరోయిన్ గా చెబుతున్నా ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నం రాంగోపాల్ వర్మ వెంటనే మానుకోవాలి. ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతా

నా Reply: వాణి గారు, నా ఇంటి ముందు ధర్నా చేయడానికి నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా….అప్పుడు మీరు కూడా నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమిలిపోవూ?