నా చావు నేను చస్తా .. నీకెందుకు అంటున్న వర్మ ?

Thursday, January 18th, 2018, 10:24:07 AM IST

ఏంటి డైలాగ్ వినగానే .. అదేదో సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది కదా !! అవును మీరు వింటున్నది నిజమే అయితే ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పింది ఎవరో కాదు సంచలన దర్శకుడు వర్మ ? అయితే ఇప్పుడు అయన ఎందుకు ఆ డైలాగ్ చెప్పాడు అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఇంతకీ వర్మ ఈ డైలాగ్ ఎందుకు చెప్పాడో తెలుసా .. తాజాగా అయన ఓ ఛానల్ లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా వంటా మాట్లాడుతూ తాను తన ఆత్మకథ రాసుకుంటే నా చావు నేను చస్తా .. నీకెందుకు అనే టైటిల్ పెడతానని చెప్పారు. ఇప్పటికే అయన నా ఇష్టం పేరుతొ ఓ పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అయన జీఎస్టీ పేరుతొ ఓ బూతు సినిమా ( వెబ్ సిరీస్ ) చేస్తున్నాడు. ఈ సినిమా గురించి తానేమి చెప్పనని .. తన సినిమాల్లో ఎలాంటి మెసేజ్ లు ఇవ్వనని చెప్పాడు.