ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ : వర్మ ఆఫీసర్ వచ్చేశాడు!

Tuesday, February 27th, 2018, 05:38:52 PM IST

రామ్ గోపాల్ వర్మ – నాగార్జున కలయికలో తెరకెక్కుతోన్న సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివ సినిమాతో పాతికేళ్ల క్రితం టాలీవుడ్ కు కొత్త ట్రెండ్ ని చూపించిన ఈ కాంబినేషన్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సినీ ప్రముఖులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ను రిలీజ్ చేశారు. మొన్నటి వరకు వివిధ రకాల టైటిల్స్ వినిపించిన ఈ పేరుకు ఫైనల్ గా వర్మ ఆఫీసర్ అని ఫిక్స్ చేశాడు. నాగార్జున సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక మే 25న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి వర్మ ప్లాన్ చేస్తున్నాడు.