ఆఫీసర్ ఆ సినిమాకు రీమేక్ కాదంటున్న వర్మ ?

Wednesday, April 4th, 2018, 09:55:52 AM IST


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా నాగార్జున తో తెరకెక్కిస్తున్న ఆఫీసర్ సినిమా షూటింగ్ జోరుగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున సరసన హీరోయిన్ గా మైరా సరీన్ నటిస్తుంది. నాగ్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా పై ఓ న్యూస్ వైరల్ ఆవూతుంది. ఈ సినిమా హాలీవుడ్ టేకెన్ సినిమాకు రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో నాగ్ పోలీస్ అధికారి కావడం .. అతనికి ఓ కూతురు ఉండడం లాంటి అంశాలన్నీ ఆ సినిమాను పోలి ఉండడంతో ఈ వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై వర్మ స్పందించాడు. ఆఫీసర్ సినిమా హాలీవుడ్ టేకెన్ సినిమాకు రీమేక్ అని వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పేసాడు. హీరో పోలీస్ అధికారి, అతనికి ఓ కూతురు అన్న విషయంలో పోలిక ఉండొచ్చు కానీ .. మిగతా విషయాల్లో ఆ సినిమాకు ఎక్కడ పోలిక ఉండదని చెప్పేసాడు. మరి వర్మ చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందొ తెలియాలంటే విడుదలదాకా ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments